Wednesday, February 22, 2006

అది రెండువేల పదిహేనవ సంవత్సరం!

అది రెండువేల పదిహేనవ సంవత్సరం!
ప్రశాంత్ తన పూర్వీకులు నివసించిన భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ నగరాన్ని చూడటానికి వచ్చినాడు!
మొదతి షాక్ ఆంధ్రప్రదేశ్ బుక్ చేసుకునేటప్పుడు తగిలినది
సారీ సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో భారతదేశంలో ఎటువంటి రాష్ట్రం లేదు: దాని పేరు “రాజీవ్ ప్రదేశ్”గా మార్చినారు కదా!

సరే సరే ఏదో ఒక ప్రదేశ్- మా వాళ్ళు హైదరాబాదు నుండి వచ్చినారు అక్కడకి ఓ టిక్కెట్ బుక్ చెయ్యండి:

ఒక్క నిమిషం హైదరాబాదు - ఆపేరుతో ఎటువంటి నగరాలూ లేవండి ఎప్పుడో దానిని “రాజీవాబాదు”గా మార్చేసినారు కదా!

ఇలా షాక్ లపై షాక్ లు తింటూ చివరకు “రాజీవాబాదు”లో ల్యాండయినాడు

“రాజీవ్ గాంధీ అంతర్జాతియ విమానాశ్రయానికి మీకు స్వాగతం” అంటూ వినిపించినది!

ఇంకొంచం ముందుకు వెల్తే అన్నీ మూడు రంగుల ఝండాలు కనిపించినాయి - “ఆహా ఎంత దేశ భక్తి, అని సంతోషించినాడు” (కానీ పాపం వాడికేం తెలుసు? మధ్యలో చక్రం లేదని, చక్రం ఉంటే దేశం లేకుంటే కాంగ్రేసు ఝండా అని అది!)
“మీరు “రాజీవ్ మార్గ్” లో వెళ్ళి “ఈస్ట్ రాజీవ్ హౌసింగ్ కాలనీ”కి వెళ్ళి అక్కడ నుండి రాజీవ్ గాంధీ సిటీ బస్టాండుకి వెల్తే “రాజీవ్ రోడ్ ట్రాన్స్పోర్ట్” బస్సులో రాజీవ్ గల్లీలో దిగండి అక్కడ మీకు రాజీవ్ మహా విగ్రహ్ చౌరస్తా వద్ద …….

హలో, హలో ఆర్ యు అలైవ్?

Tuesday, February 21, 2006

శుభోదయం

పరాయి దేశ పీడనం లో వర్షాలు గడిచాయి, వారి నుండి స్వాతంత్రం సంపాదించే సరికి కుర్రవాడి వెన్ను విరిగిపోయింది.

ప్రజలంతా ఆనందంగా సంబరాలు చేసుకొన్నారు, కానీ మార్పు మాత్రం ఏమి లేదు.
మరలా ఇప్పుడు పరాయి వాడి పాలన పోయి పర బాష రాజ్యమేలడానికి సిద్దం అయ్యింది.

సామాన్యుడు అయ్యో ఇదా ఇన్నాళ్ళు కస్టపడి సంపాదించింది ఇదా అనుకొంటున్నాడు.
ధనవంతుడు పరాయిదే మనది అన్న విధంగా పర బాషలో మునిగి తేలుతున్నాడు.
అందులో మన తెలుగు వాడు ముందున్నాడు.తెలుగు వాళ్ళందరు తెలుగు లో మట్లాడండి అంటే ఓకే అంటారే కానీ సరే అనరు, అక్కడే మొదలయ్యింది పర బాషాభిమానం. అందుకేనేమో పొరుగింటి పుల్ల కుర రుచి అని ఒక సామెత ఒక్క తెలుగు లొనె వుంది.
తెలుగులో మాట్లాడరా అంటే అదేమైనా కూడు పెడుతుందా గుడ్డ పెడుతుందా, పరాయి బాష అయితే అమెరికా తీసుకు వెల్తుంది అంటాడు.

ఏది ఎమైనా కాలం తన పని చేసుకు పోతుంది.
మాత్రుబాషాభిమానులకి మాత్రం భాదాకరం.

అందరికి మాత్రుబాషా దినోత్సవ శుభాకాంక్షలు.

శుభాభినందనలతో

మీ

తెలుగువాడు

Friday, February 10, 2006

 “Success is not final,
failure is never fatal:  It is the courage to continue that counts”

Saturday, January 28, 2006

మన వూరి చెరువు